- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు కావాల్సింది పవన్ రాజకీయ ఎదుగుదల.. హరిరామ జోగయ్య మరో లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం వరుసగా రెండు లేఖలు విడుదల చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. రాజకీయ అనుభవం లేని ఇద్దరు నేతల సలహాలతోనే పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేసి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్రాధికారంలో భాగస్వామి అయ్యేంత వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు.
తనకు కావాలసిందల్లా పవన్ రాజకీయ ఎదుగుదల.. కాపులు రాజ్యాధికారం దక్కించుకోవాలనే ఆకాంక్ష అని ఇవాళ్టి లేఖలో రాశారు. చంద్రబాబు భవిష్యత్తును మాత్రమే కోరుకునే కొంతమంది జనసేన నాయకులు.. తనను జనసేన అధికార ప్రతినిధుల ముసుగులో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తన చర్యలను తప్పుబట్టేవారు జనసేన గొడుగులో ఉన్న తెలుగుదేశం కోవర్టులని సీరియస్ అయ్యారు. ఈ సారి భీమవరంతో పాటు పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్ పోటీ చేయాలని కోరారు.