పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-09-04 14:49:44.0  )
పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నూతనంగా కొలువుదీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పెన్షన్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పెన్షన్ అందించడంలో కూడా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్(Pension) అందని లబ్దిదారులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

వచ్చే వారం నుంచి సచివాలయాల్లో(secretariats) కొత్త పింఛన్లు దరఖాస్తులు (applications) స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం లోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఆప్షన్ ఓపెన్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి. దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతంలోనే పెన్షన్ తీసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed