AP News:వైసీపీకి మరోసారి భారీ షాక్

by Jakkula Mamatha |
AP News:వైసీపీకి మరోసారి భారీ షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీకి ఎన్నికల ఫలితాల విడుదల నుంచి వరుస షాక్‌లు తగలుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో వైసీపీకి షాక్ తగిలింది. ముగ్గురు విజయవాడ కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కేశినేని శివనాథ్, బొండా ఉమ సమక్షంలో టీడీపీలో పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో కార్పొరేటర్లు లావణ్య, హర్షద్, రత్న కుమారి ఉన్నారు. విజయవాడ అభివృద్ధి కోరుతూ పార్టీలో చేరుతున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు ఒంగులు నుంచి 11 మంది వైసీపీ కార్పొరేటర్లు, విశాఖ నుంచి 14 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed