చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్: ఆ కేసులో చర్యలు తీసుకోబోమన్న సీఐడీ

by Seetharam |
చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్: ఆ కేసులో చర్యలు తీసుకోబోమన్న సీఐడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఉపశమనం కలిగింది. చంద్రబాబు అనారోగ్య కారణాల వల్ల నాలుగు వారాలపాటు కండీషన్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మధ్యంతర బెయిల్‌నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే తాజాగా సీఐడీ చంద్రబాబు హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసింది.ఈ కేసులో చంద్రబాబును ఏ3గా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో మంగళవారం చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మద్యం కేసులో చంద్రబాబు లంచ్‍మోషన్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఇతర ఏ కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోమని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మద్యం కేసులో 15న కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ వెల్లడించారు. తదుపరి విచారణను నవంబర్ 21కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

మద్యం కేసు వివరాలివే

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వ్యవహరించిన సమయంలో మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఏ3గా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో కొన్ని డిస్టిలరీలకు చంద్రబాబు అనుకూలంగా వ్యవహరిస్తూ అనుమతులు మంజూరు చేశారని సీఐడీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి నిబంధనలు సైతం ఉల్లఘించినట్లు తెలిపారు. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగిందని సీఐడీ అభియోగం మోపింది. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ వెల్లడించింది. ఇందులో ఏ1గా ఐఎస్ నరేశ్, ఏ2గా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఐపీసీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం 166, 1678, 409, 120(బి) రెడ్ విత్ 34 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్ల ప్రకారం చంద్రబాబు, కొల్లు రవీంద్ర, నరేశ్‌‌పై సీఐడీ కేసులు నమోదు చేసింది. సీఐడీ ఆరోపించిన కేసులో ఐఎస్ నరేశ్ నాటి ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా వ్యవహరించారు. అంతేకాదు కొల్లు రవీంద్ర నాటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇకపోతే ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Read More..

రూ.2వేల కోట్ల ఇసుకను జగన్ మేసేశారు : దగ్గుబాటి పురంధేశ్వరి

Advertisement

Next Story