- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News: లీక్సా? పాలిట్రిక్సా?.. ఏపీలో మైండ్ గేమ్ స్టార్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది టైం ఉంది. అయినప్పటికీ పొలిటికల్ ఉక్కపోత రోజురోజుకు పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తొలుత ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాయి. అనంతరం అభివృద్ధి పేరుతో అనుబంధంగా నేతలు రాజకీయ పార్టీలు మార్చేశారు. మరికొందరు తమను పక్కన పెట్టేశారంటూ వేరే పార్టీకి జంప్ అయ్యారు. ఈ చర్యలతో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాజాగా మైండ్ గేమ్ పాలిటిక్స్‌లో నేతలు బిజీబిజీ అయ్యారు. పార్టీని, పార్టీలోని కార్యకర్తల్లో నిరుత్సాహానికి గురి చేసేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తు్న్నారు. పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయడం అందులో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. దీనికంతటికీ చంద్రబాబు మైండ్ గేమ్ పాలిటిక్సేనని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు ఆ నలుగురు ఎమ్మెల్యేలే కాదు 18 మంది తమతో టచ్‌లోఉన్నారని ఓ మాజీ ఎమ్మెల్యే, కాదు కాదు 32 మంది టచ్‌లో ఉన్నారని ఇంకో టీడీపీ నేత ప్రకటనలు చేస్తూ వైసీపీలో గందరగోళానికి గురి చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కుండబద్దలు కొట్టారు. అటు వైసీపీ సైతం కౌంటర్ ఇస్తోంది. మేం గేట్లు ఎత్తితే టీడీపీలో మిగిలేది ఇద్దరేనంటూ చెప్పుకొస్తోంది.
టీడీపీతో టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో జోష్ నింపితే.. వైసీపీలో నిరాశ నిస్పృహలు తెచ్చిపెట్టాయి. ఇదే సందర్భంలో టీడీపీ దూకుడు పెంచితే.. వైసీపీ అధిష్టానం పార్టీపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. అటు పార్టీ ఇటు ప్రభుత్వంలోనూ ప్రక్షాళన దిశగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మైండ్‌గేమ్ పాలిటిక్స్‌లో వైసీపీ ఇరుక్కుందనే ప్రచారం ఉంది. ఆ మైండ్ గేమ్ పాలిటిక్స్ నుంచి ఎలా బయటపడాలనేదానిపై వైసీపీ దృష్టి సారించేలోపే టీడీపీ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రకటనలు చేస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీకి టచ్‌లోకి వచ్చారని తేలిందని కానీ తమతో 18 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మరచిపోకముందే వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ అటు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు నాయుడు సైతం వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వస్తే వారంతా తమ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు.
పార్టీపై ఫోకస్ పెట్టిన జగన్
తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న మైండ్ గేమ్ పాలిటిక్స్ వైసీపీలో టెన్షన్ రేపుతున్నాయి. టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరు అంటూ పార్టీలో చర్చ జరుగుతుందట. అటు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు టీడీపీలోకి వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు.. వారు టీడీపీతో కలవడానికి గల కారణాలు.. ఎక్కడ అసంతృప్తి వచ్చింది అనే అంశాలపై కూలంకుషంగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రతీ ఎమ్మెల్యే, కీలక నేతలపై నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలోని అసమ్మతి, ఆధిపత్యపోరు వంటి అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిని సరిదిద్దాలని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, ఇన్‌చార్జి మంత్రులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మేం తలుపు తీస్తే టీడీపీలో ఉండేది ఆ ఇద్దరే: మాజీమంత్రి బాలినేని
ఇదిలా ఉంటే టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ పాలిటిక్స్‌కు మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీతో టచ్‌లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోతుందని కనీసం చంద్రబాబు కూడా గెలవరేమోనని సందేహం వ్యక్తం చేశారు. అలాంటి టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోందని ఆరోపించారు. వైసీపీ గేట్లు ఎత్తితే టీడీపీలో ఉండేది ఆ అధ్యక్షులు ఇద్దరు మాత్రమేనని చెప్పుకొచ్చారు. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి టచ్‌లో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేసినట్లు అని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. మెుత్తానికి ఈ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.
Read more: