- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు’.. పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, వైసీపీ(YSRCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ఏపీలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల(sexual assault) నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు(YCP leader) కూటమి ప్రభుత్వం పై మండిపడుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency)లో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆయన ఎందుకు పరామర్శించలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. అక్కడికి మన డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు వెళ్లలేదు?. దళిత వర్గానికి చెందిన బాలిక అని చిన్న చూపా? అంటూ ఫైరయ్యారు. 30 వేల మంది అమ్మాయిలు మిస్(Missing) అయ్యారని ప్రచారం చేసి నిరంతరం జగన్ పై ఆరోపణలు చేశారు. ఏపీలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎందుకు మాట్లాడటం లేదు అని యాంకర్ శ్యామల ప్రభుత్వం(Government) పై ప్రశ్నల వర్షం కురిపించారు.