బ్రేకింగ్: ACB కోర్టు జడ్జి హిమబిందుపై అసభ్య పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్..!

by Satheesh |   ( Updated:2023-09-23 05:20:59.0  )
బ్రేకింగ్: ACB కోర్టు జడ్జి హిమబిందుపై అసభ్య పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిధులు గోల్ మాల్ చేశారని ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ పోలీసులు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి హిమబిందు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటీ నుండి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుసోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

తమ నేతను జైలుకు పంపారన్న ఆగ్రహంతో ఆమెను కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారు. కాగా, జడ్జిని కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి కార్యదర్శి పీ.సీ మీనా ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని లేఖ రాశారు.

Advertisement

Next Story

Most Viewed