- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వీరసింహారెడ్డికి షాక్.. 100 రోజుల ఫంక్షన్‌కు అనుమతి నిరాకణ
దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈ నెల 23తో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. దీంతో సత్యసాయి జిల్లాలో వేడుక నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి కోసం అధికారులను కలిశారు. తమ అభిమాన హీరో సినిమా ఫంక్షన్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి వీరసింహారెడ్డి సినిమా ఫంక్షన్‌కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలయ్య అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో క్లియర్ చేయాలని సూచించారు. అయితే నందమూరి అభిమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తమ అభిమాన హీరో సినిమా ఫంక్షన్‌ను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అనుమతి ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
కాగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో బాలయ్య డైలాగులు, ఫైట్లతో వీరవిహారం చేశారు. అన్నాచెల్లెల కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కించారు. మైత్రీమూవీమేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సంక్రాంతి సందడిలో దాదాపు రూ.100 కోట్ల కలెక్ట్ చేసింది. ఈ నెల 23తో 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. దీంతో నిర్మాతలు ఈ చిత్రం 100 రోజుల ఫంక్షన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సత్యసాయి జిల్లాలో ఫంక్షన్ చేసుందుకు ఏర్పాట్లు చేశారు. అయితే సభలు, సమావేశాలకు అధికారులు, పోలీసుల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్రంలో జీవో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మూవీకి అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి :
బ్రేకింగ్ : మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో IT దాడులు.. వెలుగులోకి సంచలన విషయాలు
కోహ్లీ కూతురితో డేటింగ్.. పేరెంట్స్ మూర్ఖులంటూ తిట్టిపోసిన కంగన