- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొన్న Tdp.. నేడు Ycp.. పోలీసులపై Mla Kethireddy సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పోలీసులపై నేతలు మాటల తూటాలు పేలుతున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తే ఇప్పుడు అధికార పార్టీ వంతు వచ్చింది. పోలీసులపై ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యన్న వ్యాఖ్యలు మరవకముందే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను సైతం పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఇప్పటికే కేసు నమోదు చేశారు. అంతేకాదు డీఎస్పీపై తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు మరువకముందే అధికార పార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం అని ఎద్దేవా చేశారు.. అంత భయం ఉంటే కశ్మీర్ మాదిరి స్పెషల్ జోన్‌ను ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు. తాడిపత్రిలో నేతల మధ్య కార్నర్‌గా పోలీసులు మారారని ధ్వజమెత్తారు. జేసీ బ్రదర్స్ అంటే పోలీసులకు ఎందుకంత మోజు అని పెద్దారెడ్డి నిలదీశారు. పోలీసులపై విమర్శలు చేస్తుంటే పోలీసు సంఘాలు ఏం చేస్తున్నాయని పెద్దారెడ్డి ప్రశ్నించారు.
Read more: