- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు ఆ దమ్ము లేదు.. అందుకే ఢిల్లీ వెళ్లారు: మంత్రి పెద్దిరెడ్డి
దిశ, కళ్యాణదుర్గం: సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సభను ఉద్దేశించి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమ పాలన అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ నాన్న రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉష శ్రీ చరణ్ తెలిపారు. చంద్రబాబు కర్ణాటక ఎన్నికల్లో జరిగిన మేనిఫెస్టోను, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఎన్నికల్లో సింగల్‌గా పోటీ చేసే ధైర్యం లేకనే బీజేపీతో పొత్తుకోసం ఢిల్లీకి వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోను ఒక కురాన్‌గా, బైబిల్‌గా. భగవద్గీతగా భావించి చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా నవరత్నాల్లో 99% శాతం అమలు చేశారన్నారు. లంచాలకు తావులేకుండా నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను తీసుకెళ్లడం జగనన్న ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.