- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ys Jaganలా ఎవరూ అలా చేయలేదు: మంత్రి పెద్దిరెడ్డి
దిశ, అనంతపురం ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యత లభిస్తోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం నాలుగు టికెట్‌లు మాత్రమే ఓసీలకు ఇచ్చారన్నారు. గతంలో ఎవరూ బీసీ, ఎస్సీ ఎస్టీలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నది సీఎం జగన్ ఆశయమన్నారు. గతంలో చంద్రబాబు బీసీల పేరు చెప్పుకొని మోసం చేశారన్నారు. తాజాగా బీసీల జపం చేస్తూ మళ్లీ ఆయా వర్గాలను మోసం చేయడానికి ఆయన యత్నిస్తున్నారన్నారు.
మా అభ్యర్థులను గెలిపించండి...
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగమ్మను సీఎం వైఎస్ జగన్ బలపరిచారన్నారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.