- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తీవ్ర పరిణామాలు తప్పవ్: మాజీ ఎమ్మెల్యే ఈరన్న
దిశ, మడకశిర: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో సీఎం జగన్‌కి ఓటు భయం పట్టుకుందని, దాంతో ఆయన చెమటలు పడుతున్నాయని మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న విమర్శించారు. అటు వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే కొందరు అధికారులు పోలీసుల్ని సీఎం జగన్ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని పాదయాత్రకు అడుగోలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే బంగారుపాళ్యంలో విద్యుత్ నిలిపివేశారని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నా సరే మూడు వాహనాలు సీజ్ చేశారని మండిపడ్డారు. నారా లోకేశ్ బహిరంగ సభ జరగకుండా ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్‌తో పాటు టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ పాదయాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి పాదయాత్ర సజావుగా జరిగేలా చంద్రబాబు చూశారని ఈవీరన్న గుర్తు చేశారు. గతంలో తమ నాయకుడు కూడా తమలా వ్యవహరించి ఉంటే జగన్ పాదం బయటపెట్టే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా లోకేశ్ పాదయాత్రను ఆపాలని చేసే ప్రయత్నం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మడకశిర ఎమ్మెల్యే ఈరన్న హెచ్చరించారు.