- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kalyanaduragam: జగన్ అవినీతిపై టీడీపీ పోరాటం... ప్రజల్లోకి తీసుకుళ్లేందుకు పిలుపు
దిశ, కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఇంటికి పంపి అన్ని విధాల దెబ్బతిన్న మన రాష్ట్రానికి అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్‌లో భవిష్యత్తుకు గ్యారెంటీపై నిర్వహిస్తున్న బస్సుయాత్రపై నిర్వహించిన సమీక్ష కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు . ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు.
వీటన్నింటినీ గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించడంతో పాటు మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రచారం చేసేందుకు తలపెట్టిన బస్సు యాత్రను కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేద్దామని కోరారు. రాష్ట్రంలోనే కాక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకున్న చాలా అవినీతి అక్రమలను వివరిస్తూ 30 రోజుల బస్సు యాత్ర, 150 రోజుల పాటు నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ చేపడదామని ఉమామహేశ్వరనాయుడు తెలిపారు.