టీడీపీ కార్యకర్తలుకు క్యాంప్ కార్యాలయం ఎప్పుడు జనతా గ్యారేజ్!

by Jakkula Mamatha |   ( Updated:2024-02-25 16:36:22.0  )
టీడీపీ కార్యకర్తలుకు క్యాంప్ కార్యాలయం ఎప్పుడు జనతా గ్యారేజ్!
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి క్యాంపు కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అమిలినేని సురేంద్రబాబు కి టికెట్ కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర వ్యతిరేక నిరసనలు సమావేశంలో కార్యకర్తలు వ్యక్తం చేశారు. కనీసం టికెట్ ప్రకటించే ముందు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను టికెట్ ఆశిస్తున్న ఉన్నం, ఉమాను నాయకులను పిలిపించి చర్చించి పార్టీలోనే ఉన్న సాధక బాధకాలు వివరించి ఉంటే బాగుండేదనీ కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చివరిగా మాట్లాడిన ఉన్నం హనుమంతరాయచౌదరి మారుతి చౌదరి ఇంతకాలం మా పట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మేము నిత్యం ప్రజలకు అందుబాటులో ఇదే కార్యాలయంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎవరు అధైర పడాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా చర్చల కొరకు తమకు ఆహ్వానం అందిందని అయితే కార్యకర్తల మనోభావాలను అభిప్రాయాలను తెలుసుకుని ఉమామహేశ్వర నాయుడు గారితో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మీరు ఏమి నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటామని కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More..

అమిత్ షా వచ్చినా.. అమితాబ్ బచ్చన్ వచ్చినా.. వైసీపీదే విజయం: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story