- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024లో టీడీపీ, జనసేనను బొందపెట్టాలి: మాజీ మంత్రి అనిల్
దిశ, ఏపీ బ్యూరో: 2024లో టీడీపీ, జనసేన పార్టీలను బొందపెట్టాలని డిప్యూటీ సీఎం అంజాద్ భాష, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులతో కలిసి మాట్లాడారు. బస్సు యాత్రలో నల్ల జెండాలు ప్రదర్శించాలని నారా లోకేష్ అంటున్నారన్నారు. ఐదు రోజులుగా చూస్తున్నామని..ఎవరైనా వస్తారని, అలా వస్తే తొక్కుకుంటూ వెళ్తామన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారని తెలిపారు.