- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:జిల్లా కలెక్టర్
దిశ ప్రతినిధి,పుట్టపర్తి:జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ టి.ఎస్ చేతన్ తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు అయ్యన్న గారి శ్రీనివాసులు, ఏపీడబ్ల్యూజే నాయకులు పుల్లయ్య, శంకర కేశవ, రామాంజి ,మురళి బసప్ప, సాయికుమార్, లెక్కల ధరన్ నాయుడు, నాగరాజు, రవికుమార్ శివ సాయి వెంకటేశులు తదితరులు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతం జర్నలిస్టులు సమర్పించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అలాగే జిల్లాలోని జర్నలిస్టులందరికి కార్పొరేట్ విద్యాసంస్థల యందు ఉచిత విద్య అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అవకాశం కల్పిస్తామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమిస్తూ జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఉచిత విద్య అమలయ్యే విధంగా గతంలో లాగానే ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పుట్టపర్తిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి పట్టాలు మంజూరు తదితర అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు తెలిపారు.