- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister: 20 మంది ఓటర్లుంటే రూ.20వేలు ఇవ్వండి (Video Viral)
- ఆ డబ్బు చేరిందో లేదో ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి
- ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలతో మంత్రి మాటామంతీ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
దిశ,డైనమిక్ బ్యూరో: ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి ఉషాశ్రీచరణ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై అధికారులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘ఒక్కో ఓటుకు రూ. వెయ్యి ప్రకారం రూపాయల ప్రకారం పంపిణీ చేయండి. ఒక గ్రామంలో 20 మంది ఓటర్లు ఉంటే రూ.20 వేలు ఇవ్వండి. ఓటర్లకు ఆ డబ్బు చేరిందో లేదో ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి’ అంటూ సలహా ఇస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల వారీగా ఓటర్ లిస్టును మంత్రి పరిశీలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.క మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉషాశ్రీ చరణ్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసేందుకు మంత్రి ఉషశ్రీ చరణ్ సిద్ధమవటం దుర్మార్గమన్నారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడి, ఓటర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజ్ఞులైన విద్యావంతులు 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించండి. పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించండని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.