- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: కలెక్టర్
దిశ, ప్రతినిధి, అనంతపురం: అర్హత కలిగిన జర్నలిస్టులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న జర్నలిస్టులకు హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీవో నెం.535లో ఉన్న అన్ని నిబంధనలు పాటిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేస్తున్న జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్స్, వెటరన్ పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సైట్స్ కేటాయిస్తామని చెప్పారు. 5 సంవత్సరాల అక్రిడేషన్ అనుభవం కలిగిన వారిని గుర్తించి, పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాలో దాదాపు 335 దరఖాస్తులు వచ్చాయని, త్వరలో దరఖాస్తులను ఆయా మండల తహసీల్దార్లకు పంపి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Read More..