- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకేష్ పాదయాత్రపై అనంతపురం డీఐజీ కీలక ప్రకటన..!
దిశ, తిరుపతి : ఏపీలో యువగళం పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు చిత్తూరు జిల్లాలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్న పలమనేరులో లోకేష్ వాహనం సీజ్, నిన్న బంగారుపాళ్యంలో బహిరంగసభకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అనంతపురం డీఐజీ రవిప్రకాష్ శనివారం స్పందించారు. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
లోకేష్ పాదయాత్ర అడ్డుకునే ఉద్దేశం పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ లేదన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు లోకేష్ యాత్రలో అడ్డంకులు కల్పిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నట్లు రవిప్రకాష్ వెల్లడించారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో నిబంధనల ఉల్లంఘన ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతే కానీ ఇతరత్రా ఇబ్బందులేవీ కలిగించడం లేదన్నారు. పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. పాదయాత్రలు చేసేటప్పుడు నేతల స్ధాయి మేరకు భద్రత కల్పిస్తామని రవిప్రకాష్ మరో క్లారిటీ కూడా ఇచ్చారు.
READ MORE
మాకు రాజకీయ భిక్షపెట్టంది శ్రీధర్ రెడ్డి సోదరులే: పొట్లూరి స్రవంతి