- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఐదేళ్లుగా అక్రమ దందాలు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రమేశ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో అరాచకాలు, అక్రమ కేసులు, దాడులు, కబ్జాలు జరిగాయని అప్పట్లో ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఆరోపించారు. కొన్ని సంఘటనలు అదే విధంగా కనిపించాయి కూడా. అయితే ఆయా ఘటనలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు చక్కటి అవకాశం దొరికినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకే లాగేందుకు సిద్ధమవుతున్నారు. నిందితుల తాట తీయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు వద్దని చెబుతున్నా నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ వైపే అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన దాడిని ఉద్దేశించి సీరియస్ అయ్యారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో దందాలు జరిగాయని, వారెవ్వరినీ వదిలేదని ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ప్రతిపక్ష నేతలపై కొందరు అధికారులు అక్రమంగా కేసులు పెట్టారని, వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం నాయకులెవరినీ కూటమిలో చేర్చుకోమన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అరాచక పాలన సాగిందని, దాంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాయని తనకు నమ్మకం ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపించిన అనకాపల్లి జిల్లా ప్రజలకు రుణ పడి ఉంటానని చెప్పారు. అనకాపల్లి జిల్లాలకు పెట్టుబడులు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని సీఎం రమేశ్ పేర్కొన్నారు.