- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న కీలక పార్టీ
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల నుంచి సీపీఎం తప్పుకుంది. ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని వెల్లడించింది. విశాఖ జిల్లాలో సీపీఎం పార్టీకి ఒక కార్పొరేటర్, ఒక జడ్పీటీసీ, నలుగురు ఎంపీటీసీల బలం ఉంది. కానీ గెలుపొందేందుకు కావాల్సినంత సంఖ్యాబలం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నికల్లో వైసీపీ, కూటమి మధ్యే ప్రధానంగా పోటీ ఉందని తేలిపోయింది.
అయితే కూటమికి సైతం తగినంత బలం లేదు. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స పోటీలో ఉండగా కూటమి నుంచి ఎవరూ ఖరారు కాలేదు. ఇద్దరు కీలక నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ టీడీపీ నుంచి ఎవరు నామినేషన్ వేస్తారదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు బొత్స సత్యనారాయణ మంచి దూకుడు మీద ఉన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులందరిని కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. వైసీపీ నేతల సమక్షంలో సోమవారం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కాగా విశాఖ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్య పరంగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 మంది ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 425గా ఉంది. అయితే 500 మంది ప్రజా ప్రతినిధులు ఎవరికి ఓటు వేస్తే వారి విజయం చాలా ఈజీ అవుతుంది. ఇదిలా ఉంటే వైసీపీ ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులందరిని బెంగళూరుకు తరలించింది. తమ నుంచి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ నెల 30న జరిగే ఎన్నికలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు టీడీపీ మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులు తమకే ఓటు వేస్తారని, ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.