Rave Party Case: మంత్రి కాకాణి కారు స్టిక్కర్ వాడింది అతనే...

by srinivas |
Rave Party Case: మంత్రి కాకాణి కారు స్టిక్కర్ వాడింది అతనే...
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాణి కారు స్టిక్కర్‌ను వాడిన వ్యక్తిని సీసీబీ పోలీసులు గుర్తించారు. పుర్ణారాడ్డి అనే వ్యక్తి మంత్రి కారు స్టిక్కర్ ను ఉపయోగించారని నిర్ధారించారు. అయితే ప్రస్తుతం పుర్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఫామ్ హౌస్ నుంచి పుర్ణారెడ్డి పారిపోయారు. పూర్ణారెడ్డిని గాలిస్తున్నట్లు పట్టుకున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ముమ్మర దర్యాప్తుతో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పార్టీ వెనుక చిత్తూరు మూలాలు ఉన్నాయి. రేవ్ పార్టీ నిర్వహణలో చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో ఏ2గా రణధీర్, ఏ3గా అరుణ్ కుమార్‌ను చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారు. పార్టీలో పాల్గొన్నారా..?, డ్రగ్స్ విక్రయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed