- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అరకులో విశాఖ యువకుడు హత్య.. 4 రోజుల తర్వాత డెడ్ బాడీ గుర్తింపు

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. విశాఖ యువకుడు చంద్రకాంత్‌ను కొట్టి చంపారు. అనంతరం చంద్రకాత్ కాళ్లు, చేతులు కట్టేసి కాలువలో పడేశారు. తాజాగా మృతదేహం లభ్యమైంది. విశాఖ కంచరపాలెం జయభారత్ నగర్ చెందిన చంద్రకాంత్ తన బ్యాచ్‌తో నాలుగు రోజుల క్రితం అరకు వెళ్లారు. అయితే స్థానిక యువకులను గంజాయి అడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో యువకులతో చంద్రకాంత్ గొడవ పడ్డారు. ఈ గొడవలో చంద్రకాంత్‌ను 8 మంది యువకులు దారుణంగా కొట్టారు. దీంతో చంద్రకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే కాళ్లు చేతులు, కట్టేసి చంద్రకాంత్ మృతదేహాన్నిస్థానిక కాలువలో పడేశారు. జులై 30న స్నేహితులతో వెళ్లిన చంద్రకాంత్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తండ్రి డుంబ్రిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కొర్రాయి పంచాయతీ బొందుగూడ గ్రామ సమీపంలోని కాలువలో చంద్రకాంత్ మృతదేహం లభ్యమైంది.