- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ఆ విషయంలో సిగ్గు పడాలి: YCP సర్కార్‌పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ జగన్ సర్కార్‌పై బీజేపీ అగ్రనేత, హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తీరంలో మోడీ తొమ్మిదేళ్ల పాలన వివరించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్ తనది రైతుల సంక్షేమ ప్రభుత్వమంటున్నారని.. కానీ, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉందని ఫైర్ అయ్యారు.
రైతుల ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని భరోసా పేరుతో పంచుతూ సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లను తమ పథకంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేషన్ బియ్యం మోడీ ఇస్తుంటే.. సీఎం జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్ప చేసింది ఏం లేదని విమర్శలు కురిపించారు. విశాఖను విద్రోహ శక్తుల అడ్డాగా మార్చారని అమిత్ షా ఫైర్ అయ్యారు. ఏపీలో భూ మాఫియా, మైనింగ్ స్కామ్‌లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
Visakha: పథకాలు మావి.. ఫొటోలు ఆయనవి.. సీఎం జగన్‌పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం
- Tags
- YSRCP
- Telugu News