వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి అంబటి రాయుడు ..ఎక్కడ నుంచి పోటీ అంటే?

by Seetharam |
వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి అంబటి రాయుడు ..ఎక్కడ నుంచి పోటీ అంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అంబటి రాయుడు ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరులోని సొంతూరు పొన్నూరుకు షిష్ట్ అయిపోయారు. గుంటూరు లోక్‌సభ పరిధిలోని పలు నియోజకవర్గాలలో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటించారు. రాజకీయాల్లో చేరేందుకు అవగాహన అవసరం అని... ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. తాను ఏం చేయగలను అనేదానిపై పూర్తిగా అధ్యయనం చేశారు. అనంతరం అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే అంబటి రాయుడు ఈసారి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుంటూరు లోక్‌సభ నుంచి బరిలోకి

అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తనకు రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ ఇన్‌స్పిరేషన్ అని పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ట్విటర్ వేదికగా సీఎం జగన్‌పై పలు ప్రశంసలు సైతం కురిపించారు. ప్రజలతో మమేకం అవుతున్న సందర్భంలోనూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనియాడిన సంగతి తెలిసిందే. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరతారని అంతా ఊహించారు. అంతా ఊహించినట్లే అంబటి రాయుడు వైసీపీలోచేరారు. ఇకపోతే అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్ బరిలో వైసీపీ అభ్యర్థిగా నిలుస్తారనే ప్రచారం జరుగుతుంది. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా రెండు సార్లు గల్లా జయదేవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ స్ట్రాంగ్ అభ్యర్థిని ఈసారి బరిలోకి దించాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే అంబటి రాయుడును గుంటూరు లోక్‌సభ నుంచి బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతుంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అన్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed