Breaking: ఇలా చేస్తేనే రాజకీయాల్లో పైకొస్తారు.. అంబటి రాంబాబు

by Indraja |   ( Updated:2024-02-01 11:50:18.0  )
Breaking: ఇలా చేస్తేనే రాజకీయాల్లో పైకొస్తారు.. అంబటి రాంబాబు
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అధికార పార్టీకి, విపక్షాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అంబటి రాంబాబు శ్రీకృష్ణదేవరాయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తనకు టికెట్ ఇవ్వలేదని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని.. ఆయనకు గుంటూరు టికెట్ ఇస్తే తనకు నరసరావుపేట టికెట్ కావాలని పట్టుబట్టినట్లు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి గుంటూరు నుండి పోటీ చెయ్యమని అక్కడ నుండి పోటీ చేసిన గెలుస్తారని ఎంత నచ్చచెప్పిన కృష్ణదేవరాయలు వినలేదని పేర్కొన్నారు. ఇక అధిష్టానం కూడా శ్రీకృష్ణదేవరాయల అభిప్రాయంతో ఏకీభవించాడనికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆయన పార్టీని వదిలిపెట్టి పోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసేవాళ్ళే రాజకీయాల్లో పైకి వస్తారని తెలిపారు. అంతేకాని ఆ నియోజకవర్గం కావాలి ఈ నియోజకవర్గం కావాలి అని అడగడం సరైన పద్ధతి కాదని తెలిపారు. తాను గుంటూరు అడిగితే జగన్మోహన్ రెడ్డి తనని సత్తెనపల్లికి పంపారని తెలిపిన అంబటి.. జగన్మోహన్ రెడ్డి మాటపైన అక్కడి నుండి పోటీ చేశానని.. ఈ నేపథ్యంలో మొదట తాను ఓడిపోయినా ఆ తరువాత గెలిచానని పేర్కొన్నారు.

ఇక జగన్ మాట వినబట్టి తనకి మంత్రి పదవి ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ ఎక్కడ పెడితే అక్కడ నుండి పోటీ చేసి పార్టీకి ఉపయోగపడాలి తప్ప.. పార్టీని వాడుకుని తరువాత పార్టీ నాకు ఉపయోగపడలేదని పార్టీని వదిలిపెట్టి పోవడం ధర్మం కాదని.. అలా చెయ్యడం దుర్మార్గం అని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అని.. వైసీపీ అధ్యక్షులు అని.. కనుక ఆయన చెప్పినట్లు వినడం ధర్మమని .. మనకు అన్యాయం జరగదు.. న్యాయమే చేస్తారనే విశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన నాయకులు తప్పుదోవ పడితే పార్టీ ఎలా మానేజ్ చేయగల్గుతుందని ప్రశ్నించారు. మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా కొనసాగినటువంటి శ్రీకృష్ణదేవరాయలు.. షడన్ గా పార్టీకి రాజీనామా చేసి వెళ్లడం అనేది సరైనటువంటి విధానం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story