- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: పవర్ స్టార్ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పై అంబటి ఫన్నీ ట్వీట్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపి అధినేత వైఎస్ జగన్ తో సహా ఆ పార్టీ నేతలందరూ సినిమా పేర్లను డైలాగులను విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడ డైలాగులతోనే బదులు చెప్తోంది. అయితే తాజాగా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ (X) వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్ని ఎద్దేవ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎంఎస్ నారాయణ చెప్పే డైలాగ్ ను అంబటి తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఎక్కడ నెగ్గాలో తెలియనోడు, ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు పవన్ కళ్యాణ్ అని అంబటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే పవన్ నటించిన సినిమాలోని డైలాగ్ ను పవన్ ను ఎద్దేవ చెయ్యడానికి ఉపయోగించడం గమనార్హం. ఇక అంబటి చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
ఎక్కడ ముంచాలో తెలిసినోడు, ఎక్కడ వేసెయ్యాలోబాగా తెలిసినోడు.. ఎవడు? అంబటి రాంబాబు.. మీ అధినాయకుడు అని నువ్వే చెప్పినట్టున్నావ్ అని ఒకరు కామెంట్ చేశారు. ఇక మరొకరు ఎవరికి బానిసత్వం చెయ్యాలో తెలిసినవాడు అంబటి అని కామెంట్ చేశారు. ఇలా రకరకాలుగా కామెంట్ల రూపంలో అంబటి పై నెటిజన్స్ విమర్శల జల్లు కురిపిస్తున్నారు.