- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amaravathi: బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణభివృద్ధి శాఖమంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కంకిపాడులో జరిగిన కెడ్రాయ్ సౌత్ కాన్ 2024 సమ్మిట్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బిల్డర్లు, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో చాలామంది నిర్మాణ రంగం వైపు చూస్తున్నారని, ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.
అలాగే నిర్మాణ రంగ అభివృద్ది కోరకు అధికారులతో సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు. సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అంతేగాక ఈ సాఫ్ట్ వేర్ తో మున్సిపల్ శాఖ సహా అన్ని శాఖల సాఫ్ట్ వేర్ లను అనుసాందానించి సింగిల్ విండో అనుమతులు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానానికి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని, సాధ్యమైనంత త్వరగా అమరావతిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని, అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ వెల్లడించారు.