- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: అమరావతే రాజధాని.. ఢిల్లీ గడ్డలో దద్దరిల్లిన నినాదం
దిశ వెబ్ డెస్క్: అమరావతినే ఏపీకి రాజధాని అంటూ ఢిల్లీ గడ్డలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకే రాజధాని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తమ వాణిని బలంగా వినిపించారు. ధరణికోట టు ఎర్రకోట పేరుతో ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జై అమరావతి నినాదాలు వినిపించారు.
ఇక అమరావతి రైతుల ధర్నాకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ మద్దతు తెలిపాయి. ఆ పార్టీ నేతలు రైతులతో కలిసి అమరావతి నినాదాలు చేశారు. ఏపీకి రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ నెల 19న (సోమవారం) ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలోనూ అమరావతి రాజధాని నినాదాన్ని వినిపించనున్నారు రైతులు.
- Tags
- amaravati