- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP:అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం: వైసీపీ నేత
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్‌ను(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయల్దేరారు. అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించేందుకు రిపోర్ట్ రెడీ చేశారు. అల్లు అర్జున్‌పై BNS 118, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన పై తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌ను ఆయన ట్యాగ్ చేశారు.
ALLU ARJUN అరెస్టు అన్యాయం !@alluarjun @PawanKalyan @revanth_anumula @ncbn @TelanganaDGP @TelanganaCMO
— Ambati Rambabu (@AmbatiRambabu) December 13, 2024