అలా చేయడం కోడ్ ఉల్లఘించినట్లు కాదు : అల్లు అర్జున్

by Y.Nagarani |
అలా చేయడం కోడ్ ఉల్లఘించినట్లు కాదు : అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్రహీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)నిన్న ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బన్నీని చూసేందుకు భారీగా ప్రజలు, ఫ్యాన్స్ రావడంతో స్థానిక వీఆర్వో సీరియస్ అయ్యారు. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని, భారీగా జన సమీకరణ చేశారని ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అర్జున్, శిల్పా రవి 144, పోలీస్ యాక్ట్ 30 లను ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ.. అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో అల్లు అర్జున్ పలు కీలక విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Silpa Ravichandra Kishore Reddy) ఇంటికి వెళ్లడం తన వ్యక్తిగతమైన పర్యటన అని, అతనిని అభినందించేందుకే వెళ్లానని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే తప్ప తనకు బహిరంగసభ నిర్వహించే ఉద్దేశం లేదన్నారు అల్లు అర్జున్. ఇది ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘన కిందకు రాదని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అల్లు అర్జున్ పిటిషన్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు.. నేడు దీనిపై విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed