- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబుకు ఖైదీ నెంబర్ కేటాయింపు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేతకు స్పెషల్ రూమ్!
దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల అనంతరం ఎట్టకేలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు జైలుకు తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదివారం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను సోమవారం తెల్లవారుజూమున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ అప్పర్ బ్లాక్‌లో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక గదిని కేటాయించారు.
జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. దీంతో 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఫస్ట్ టైమ్ జైల్లో చంద్రబాబు కాలుపెట్టారు. ఇక, వీఐపీ కావడంతో చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతా కల్పించారు. అంతేకాకుండా జైల్లో ఆయనకు ఓ వ్యక్తిగత సహయకుడికి పర్మిషన్ ఇచ్చారు. జైల్లో చంద్రబాబుకు ఇంటి అల్ఫాహారం, భోజనం, మెడిసన్‌కు అనుమతి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆయనకు ఇంటి భోజనం, మెడిసన్‌కు పర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబును సెంట్రల్ జైలులో ఉంచిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రాజమండ్రిలో సెక్షన్ 30 అమలు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతా కట్టుదిట్టం చేశారు. మరి కాసేపట్లో జైలులో చంద్రబాబుకు స్నేహ బ్లాక్ ఎదురుగానే ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలి బ్రాహ్మణిల ములాఖత్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు.