- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీ బంద్ సంపూర్ణం
దిశ, ఏలూరు/బుట్టాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలుపుతూ తీర్మానం చేయడానికి నిరసిస్తూ ఆదివాసి జేఏసీ గిరిజన, ప్రజా సంఘాలు, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ కొనసాగింది. శుక్రవారం మండల బుట్టాయిగూడెంలో బస్టాండ్ సెంటర్లో ప్రజలంతా రోడ్డు దిగ్బంధనం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా, ఆదివాసీ, ముస్లిం సంఘాలు మద్దతు తెలిపాయి. అనంతరం జరిగిన సభకు గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కారం భాస్కర్ అధ్యక్షత వహించగా ఆదివాసీ జేఏసీ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్ రామ్మోహన్, జనసేన నియోజకవర్గం ఇంచార్జి చిబాలరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎమ్ఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ, ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు, జేఏసీ వైస్ చైర్మన్ కుర్సం దుర్గారావు, ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఉన్న ఆదివాసీలంతా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పీవైఎల్ టీ బాబురావు, కెచ్చల పోతురెడ్డి, వెట్టి భారతి, మొడియం నాగమణి, కారం లక్ష్మి, కొరస గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
పోలవరంలో..
మండలం లో ఏజెన్సీ బంద్ విజయవంతమైంది. వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి పైకి వచ్చిన నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మడకం లక్ష్మి, బొరగం భూ చంద్రం, కుంజా సుభాషిణి, ముచ్చిక రంజిత్ కుమార్, కొవ్వా సి శ్రీనివాసరావు, కోటం లక్ష్మణరావు, కుర్సం రమేష్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జీలుగుమల్లిలో..
స్థానిక జగదాంబ గుడి సెంటర్లో హైవే దిగ్బంధనం చేశారు. తొలుత హైస్కూల్ నుంచి ర్యాలీగా హాస్పిటల్ ప్రాంగణం వరకు వచ్చారు. కార్యక్రమంలో నాయకులు వీ సుబ్బన్న, సిరి బాలరాజు, తెల్లం దుర్గారావు, కాకి మధు, మడకం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జీ మాడుగుల మండలంలో..
మండల కేంద్రంతో పాటు వివిధ పంచాయితీల్లో తెల్లవారుజాము నుంచే ప్రజా సంఘాల నాయకులు బంద్ లో పాల్గొన్నారు. వెంటనే జీవో 52 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ భారీగా పోలీసు బలగాలను మోహరించి పర్యవేక్షించారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు మత్య్సరాస వరహాల రాజు, చిట్టి బాబు, ధర్మన్న పడాల్ తదితరులు పాల్గొన్నారు.