- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Breaking : చిరంజీవికి పద్మ విభూషణ్.. జనసేనకు టెన్షన్..
దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. జనసేనకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు కలుపుకోని అధికార పార్టీని అణగదొక్కాలని.. రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎంని ఓడించి విజయభేరిని మోగించాలని వ్యూహ రచన చేస్తున్నారు.
అయితే ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం 2024 పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని.. చిరంజీవి జగన్ తో సన్నిహితంగా ఉండడం చేత ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చేలా చేశారని జగన్ అభిమానులు పేర్కొంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ అభిమానులను ఏపీ సీఎం జగన్ కి థాంక్స్ చెప్పాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు. కాగా జగన్ అభిమానాలు సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు జగన్ కి థాంక్స్ చెప్పాలని చేసిన పోస్టుల పై నెటిజన్స్ స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు జగన్ అభిమానులు చేసే పోస్టులకు మద్దతుగా కామెంట్స్ చేస్తే మరికొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల వేళ అవార్డుల రాజకీయం ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్ తో చిరంజీవి సన్నిహితంగా ఉండడంతో.. మెగా అభిమానుల ఓట్లు జగన్ కు వెళ్లే అవకాశం ఉందని.. అవార్డుల నేపథ్యంలో జనసేన ఓట్లు చీలే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం 2024 పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. విడుదలైన జాబితా వివారాలు చూస్తే.. 5 మంది పద్మ విభూషణ్ కి, 17 మందికి పద్మ భూషణ్ తో పాటు 110 మందికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. కాగా పద్మ విభూషణ్ పురస్కార గ్రహితల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ధీరుడు ఆంధ్రుల అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.