- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో రోడ్డెక్కిన న్యాయవాదులు.. ఆ చట్టాన్ని నిరసిస్తూ ప్రదర్శన
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి యాజమాన్య హక్కుల చట్టం-2022 తీసుకురావడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆదివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ వరకు ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చట్టం ప్రకారం రెవెన్యూ, ప్రత్యేక అధికారులు స్థిరాస్తులకు సంబంధించిన కేసులు పరిష్కారం చేస్తారన్నారు. దీనిపైన టైటిల్ అథారిటీ, అప్పిలెట్ అథారిటీ ఉంటుందని అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టు వారికి రివిజన్ పవర్ ఇస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో సివిల్ కోర్టుల్లో సిరాస్తుల కేసులు పరిష్కరించే అవకాశం లేదని, ఆ ఆస్తి తాకట్టు పెట్టాలన్నా, అమ్మాలన్నా, గిఫ్ట్ రాయాలన్నా టైటిల్ రిజిస్టర్ అథారిటీ అనుమతి ఉండాలని, దేశంలో అత్యున్నత న్యాయస్థానాలు చెప్పిన తీర్పులను కూడా ఈ టైటిల్ రిజిస్టర్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుందని ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు. న్యాయ వ్యవస్థ పై ఇది ఒక రకమైన దాడి అని రాష్ట్రంలో సుమారు 66శాతం కేసులు స్థిరాస్తులకు సంబంధించినవి మాత్రమేనని చెప్పారు.ఈ చట్టంపై పరిజ్ఞానం లేని రెవెన్యూ లేదా ప్రత్యేక అధికారులు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
ఈ చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు గత 68 రోజులుగా కోర్టులను బహిష్కరించినట్లు తెలిపారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022ను రద్దు చేసే వరకు సమ్మె, నిరసనలు కొనసాగుతాయని సత్యనారాయణ తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పైల శ్రీనివాసరావు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.