- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu Naidu : హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనె 19కు వాయిదా వేసింది. ఈనెల 18 వరకు విచారణ చేపట్ట వద్దని ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ గురించి చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే స్కిల్ స్కామ కేసులో ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకుండానే అరెస్ట్ చేశారని క్వాష్ పిటిషన్‌లో చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను తప్పుడు కేసులో ఇరికించారని చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో తెలిపారు.
సీఐడీ దగ్గర ఆధారాల్లేవన్న న్యాయవాది దమ్మాలపాటి
ఎఫ్ఐఆర్ క్వాష్ చేసేందుకు గ్రౌండ్స్‌ను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వెల్లడించారు. సీఐడీకి వచ్చిన ఫిర్యాదులో చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణ లేదని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును ఇరికించారని.. ఆయన నేరం చేశారనడానికి సిఐడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడుని నిందితుడుగా చేర్చారని.. సెక్షన్ 409 పెట్టారని కానీ దీనిపై సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపలేదని అన్నారు. అంతేకాదు చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో సీఆర్‌పీసీ 50ను పోలీసులు ఫాలో కాలేదని న్యాయవాది శ్రీనివాస్ ఆరోపించారు. క్రైమ్ నెంబర్‌తో పాటు, ఎఫ్ఐఆర్ సెక్షన్లు తప్ప ఎలాంటి సమాచారాన్ని పోలీసులు చెప్పలేదని న్యాయవాది శ్రీనివాస్ పేర్కొన్నారు.
More News : చంద్రబాబుపై మరికొన్ని కేసులను సిద్దం చేస్తున్న జగన్ సర్కారు