ఇకపై సామాన్యుడిగానే ఉంటా... నటుడు అలీ సెన్సేషనల్ కామెంట్స్

by srinivas |   ( Updated:2024-06-28 15:35:47.0  )
ఇకపై సామాన్యుడిగానే ఉంటా... నటుడు అలీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇకపై సామాన్యూడిగానే ఉంటానని సినీ నటుడు అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఇక నుంచి సినిమాలే తనకు ముఖ్యమని చెప్పారు. 20 టీడీపీలో, 5 ఏళ్లకు పైగా వైసీపీలో, 40 ఏళ్లు సినీరంగంలో ఉన్నానని తెలిపారు. తన సేవకు రాజకీయం తోడైతే పదిమందికి సాయపడదామనుకున్నానని చెప్పారు. కానీ రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లో రాలేదన్నారు. తన సంపాదనలో 20 శాతం ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. తాను టీడీపీ, వైసీపీ ఉన్నా ఎవరినీ కించపర్చే మాటలు మాట్లాడలేదని చెప్పారు. ఈ రోజు నుంచి తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని, ఎన్నికల్లో సామాన్యూడిగా ఓటు వేస్తానని అలీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed