సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే చర్యలు తప్పవు.. పోలీస్ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula Mamatha |
సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే చర్యలు తప్పవు.. పోలీస్ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియా(Social Media)లో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దు అని ఏపీ పోలీస్ శాఖ(AP Police Department) తెలిపింది. తప్పుడు పోస్టులు పెట్టెవారిని పోలీసు యంత్రాంగం గమనిస్తూనే ఉంటుందని, వారి పై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా(Social Media)లో కుల, మత వర్గాల మధ్య విబేధాలకు దారితీసే పోస్టులు పెట్టవద్దని విజయవాడ(Vijayawada) పోలీసులు ఓ ప్రకటనలో సూచించారు. మార్ఫింగ్, ట్రోలింగ్, అశ్లీల, హింసాత్మక ఫొటోలు అండ్ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్స్‌తో అసభ్యకర పోస్టులు, మిసేజ్‌లు చేయడం, ఆన్‌లైన్ వేధింపులు, చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫిర్యాదులకు 112కు కాల్ చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed