Kakinada: పవన్ కల్యాణ్ పర్యటన ఎఫెక్ట్.. కాకినాడ డీసీఎస్‌ఓ ప్రసాద్‌పై చర్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-29 16:21:02.0  )
Kakinada: పవన్ కల్యాణ్ పర్యటన ఎఫెక్ట్.. కాకినాడ డీసీఎస్‌ఓ ప్రసాద్‌పై చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడ పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్‌ చేసిన 640 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పవన్‌ స్వయంగా పరిశీలించారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. కాకినాడ డీసీఎస్‌ఓ ప్రసాద్(DCSO Prasad)పై చర్యలు తీసుకుంది. రేషన్ బియ్యం తరలింపు విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ప్రసాద్‌ను కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. కాకినాడ ఇన్‌చార్జి డీసీఎస్‌వో‌గా లక్ష్మీదేవిని నియమించారు.

Advertisement

Next Story