- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. తీవ్ర గాయలైన బాధితుల పరిహారం ప్రకటింపు
దిశ, వెబ్ డెస్క్ : అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర ఘటనలో గాయపడిన బాధితులను ఈరోజు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన 10 మందికి రూ.50 లక్షల నష్ట పరిహారాన్ని, స్వల్ప గాయలైన 26 మందికి రూ.25 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇక మృతి చెందిన 17 మందికి రూ.1 కోటి నష్ట పరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరి వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా ప్రభుత్వం తరుపున చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రతీ బాధితున్ని చంద్రబాబు స్వయంగా వారి వద్దకు వెళ్ళి పలకరించి, ఓదార్చారు.