NTR జయంతి.. టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు కీలక పిలుపు

by Satheesh |   ( Updated:2024-05-27 16:05:07.0  )
NTR జయంతి.. టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. రేపు (మంగళవారం) ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహిస్తామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లుకు ఆయన కీలక పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని అన్నారు.

Read More...

చంద్రబాబే ముఖ్యమంత్రి.. తేల్చేసిన జనసేన కీలక నేత

Advertisement

Next Story