తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు.. టీటీడీ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |
తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు.. టీటీడీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఘాట్ రోడ్డుల్లో ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలను రెడీ చేస్తోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఘాట్ పైకి నో ఎంట్రీ అనే నిబంధన తేనుంది. అలిపిరిలో ఫిట్ నెస్ టెస్ట్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఘాట్ రోడ్డు ప్రమాదాలపై టీటీడీ, పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కాలం చెల్లిన వాహనాలు ఘాట్ రోడ్డుపైకి వస్తే చర్యలు తీసుకోనున్నారు. త్వరలో ప్రీపెయిడ్ టాక్సీలను ఘాట్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Advertisement

Next Story