రాజకీయాల్లోకి ‘ఆ కుర్చీని మడతపెట్టి’ డైలాగ్.. సీఎం సీటుకే ఎసరు పెట్టిన తాత!!

by sudharani |   ( Updated:2024-02-19 05:58:46.0  )
రాజకీయాల్లోకి ‘ఆ కుర్చీని మడతపెట్టి’ డైలాగ్.. సీఎం సీటుకే ఎసరు పెట్టిన తాత!!
X

దిశ, ఫీచర్స్: ‘ఆ కుర్చీని మడత పెట్టి’ డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇటీవల సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపిన ఈ డైలాగ్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలనూ షేక్ చేస్తోంది. సీఎం జగన్ కుర్చీకి ఎసరు పెట్టేలా ఈ డైలాగ్ ట్రెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ రహమత్ నగర్‌కు చెందిన మహ్మద్ అనే వ్యక్తి ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్‌లో హమాలీగా పని చేస్తూ జీవనం గడిపేవాడు. ఒకానొక సమయంలో ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్టోరీ చెప్తూ.. ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే డైలాగ్ యూస్ చేశాడు. దీంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారి రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. ఆయనతో పాటుగా.. ఆ కుర్చీ మడత పెట్టి డైలాగ్ కూడా బాగా పాపులర్ అయింది.

ఇక ఈ మధ్య కాలంలో ఈ డైలాగ్‌ను ఎవరూ పడితే వాళ్లు.. ఎక్కడ పడితే అక్కడ ఉపయోగిస్తున్నారు. నిన్న కాక మొన్న మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో ఏకంగా ఓ పాటలోనే ఈ డైలాగ్‌ను యూస్ చేశారు. ఇక ఇప్పుడు ఈ డైలాగ్ సినిమాలను దాటి రాజకీయాల్లో అడుగుపెట్టింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో వైసీపీ వాళ్లు మీరు చొక్కాలు మడతపెడితే.. మేము ఆ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని నారా లోకేష్ జగన్‌ను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా.. పక్కనే ఉన్న ఇనుప కుర్చీని మడత పెట్టి మరీ చూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో రాజకీయవర్గాల్లో తీవ్ర దూమరం రేపుతోంది. అయితే ఓ పక్క మాత్రం.. కుర్చీ తాతా ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిపోయాడంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story