ఆ విషయం నాకు తెలియదు: పేర్ని జయసుధ

by srinivas |
ఆ విషయం నాకు తెలియదు: పేర్ని జయసుధ
X

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం(Ration rice) మాయం కేసులో ఏ1 నిందితురాలు జయసుధను పోలీసులు విచారించారు. తమ గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ఆమెకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. లాయర్ల సమక్షంలో దాదాపు 2 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఎలా మాయం అయ్యాయని, దాని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. అయితే గోదాం వ్యవహారాలు తనకు తెలియదని జయసుధ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ విషయాలన్ని మేనేజర్ మానస తేజకే తెలుసని చెప్పినట్లు సమాచారం.

కాగా మచిలీపట్నలోని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) కి చెందిన గోదాంలో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం మాయం అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులుగా పేర్ని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని కుటుంబానికి కోర్టు ఊరట కలిగించింది. పేర్ని నాని భార్య జయసుధకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు పోలీసుల విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో తన లాయర్ సమక్షంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed