- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్ట పగలే వైసీపీ కార్యకర్త దారుణహత్య
దిశ, డైనమిక్, కడప: కడప నగరంలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు భుర్ఖాలు ధరించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డి (32) ని వేట కొడవళ్ళతో నరికి హత్య చేశారు. ఈ హత్యకు భూ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా వినిపిస్తున్న వివరాలు మేరకు.. కడపకు చెందిన శ్రీనివాసుల రెడ్డికి మరి కొంత మందితో భూ తగాధాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాసులు రెడ్డి జిమ్ము నుంచి ఇంటికి వస్తున్న సమయంలో సంధ్యా సర్కిల్ వద్ద ఇరువురు వ్యక్తులు బుర్కా ధరించి వచ్చి వేటకొడవళ్ళతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
శ్రీనివాసులు రెడ్డిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలానికి డి.ఎస్.పి ఎం.డి షరీఫ్, వన్ టౌన్ సి.ఐ నాగరాజు చేరుకుని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జున రెడ్డి ఆసుపత్రికి చేరుకొని హత్యకు గల కారణాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. కాగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ షరీఫ్ తెలిపారు.