- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గోశాలలో తెల్లతాచు పాము హల్ చల్
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెల్ల తాచుపాము హల్ చల్ చేసింది. గోశాలలోకి ప్రవేశించి బుసలు కొట్టింది. దీంతో భయాందోళన చెందిన స్థానికులు స్నేక్ సేవియర్ సొసైటీ నిర్వాహకులకు ఫోన్ చేయడంతో అతను చాకచక్యంగా పామును బంధించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏలూరు రోడ్డు జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో గొశాల ఉంది. ఈ గోశాలలోకి ఏడు అడుగుల భారీ తెల్ల తాచుపాము ప్రవేశించింది. గోశాలలోకి ప్రవేశించిన అనంతరం బుసలు కొడుతూ హల్‌చల్ చేసింది. దీంతో భయాందోళన చెందిన స్థానికులు స్నేక్ సేవియర్ సొసైటీ నిర్వాహకులు క్రాంతికి ఫోన్ చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న క్రాంతి తెల్ల తాచుపాము ను చాకచక్యంగా పట్టుకున్నారు. చాలా అరుదుగా తెల్లతాచు కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఈ తెల్లతాచును చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. అనంతరం పామును క్రాంతి మరల గూడెం అడవి అటవీ ప్రాంతంలో వదలేశారు.