- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక వీడియో ఆయన జీవితాన్నే మార్చేసింది: వైసీపీ ఎంపీ పొలిటకల్ ఫ్యూచర్ క్లోజేనా?
దిశ, డైనమిక్ బ్యూరో : కాలం అనేది మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. కాలం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో... బ్యాడ్ టైమ్‌గా మిగిలిపోతుందో ఎవరూ ఊహించలేరు. టైం కలిసివస్తే ఊహించని స్థాయిలో ఉంటారు. టైం బ్యాడ్ అయితే అధో:పాతాళానికి వెళ్లిపోతారు. ఇవి మనిషి జీవితంలో తప్పక ఎదుర్కొనేవే. అనంతపురం రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందుతున్న నాయకుడు నాటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఓ పోలీస్ అధికారి మీసం మెలేసీ పోలీసుల పవరేంటో చూపించారు. అంతే అది అప్పట్లో ఒక సంచలనం. అంతేఏముంది కాలం కలిసొచ్చింది..ఆయన ఇప్పుడు ఎంపీ అయి కూర్చున్నారు. అదే కాలం నాలుగేళ్లు కూడా తిరగముందే బ్యాడ్ అయ్యింది. ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారంటూ అదే ఎంపీ విమర్శల పాలయ్యారు. దీంతో ఆ ఎంపీ భవిష్యత్ పొలిటికల్ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇంతకీ ఆ మీసం మెలేసిన మాజీ సీఐ ఎవరో..న్యూడ్ వీడియో కాల్ ఎంపీ ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుందిలెండి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. రాజకీయాల్లో గోరంట్ల మాధవ్ అడుగు పెట్టడం తొలిసారి పోటీ చేసి ఏకంగా ఎంపీగా గెలుపొందడంతో ఇక రాజకీయాల్లో ఈయన జెట్ స్పీడుతో వెళ్తాడని అంతా భావించారు కానీ సీన్ రివర్స్ అయ్యింది. మాధవ్ ఉలుకు కానీ పలుకు కానీ లేదు. నిన్నమెున్నటి వరకు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. రాను రాను అది కూడా వినిపించడం లేదు.
పొలిటికల్ ఆరంగేట్రమే సంచలనం
గోరంట్ల మాధవ్ రాజకీయ ప్రవేశం ఓ సంచలనం.పోలీసు అధికారిగా ఉన్న మాధవ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమం విషయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాడు పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ మీసం మెలేసి పోలీసు పవరేంటో అంటూ సవాల్ విసిరారు. అసలే రాయలసీమ..అందులోనూ రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తిపై మీసం మెలేయడంతో సీఐ మాధవ్ వార్తల్లో నిలిచారు. తెగ వైరల్ అయ్యారు. దీంతో వైసీపీ ఆఫర్ ఇవ్వడంతో తన పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గోరంట్ల మాధవ్ అప్పటి వరకు ఓ సాధారణ సీఐగా ఉండగా పోలీసులు అధికారిగా ఉన్నప్పుడు ఆయనపై నమోదు అయిన కేసులు..వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ వాటిని అసలు పట్టించుకోలేదు గోరంట్ల మాధవ్. ఎంపీ అయిన తర్వాత కూడా అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. కియా మోటార్స్ కంపెనీ సిబ్బందిని ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. అలాంటిదేమీ జరగేలేదని వివరణ ఇచ్చినప్పటికీ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి. అసలే అధికార పార్టీ..అందులోనూ ఎంపీ..ఇంకా చెప్పాలంటే పోలీస్ శాఖలో పనిచేసిన అనుభవం ఉండటంతో వాటన్నింటని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో గోరంట్ల మాధవ్ సక్సెస్ అయ్యారు.
జీవితాన్ని మార్చేసిన వీడియో
ఇదిలా ఉంటే ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. మహిళతో న్యూడ్ వీడియో కాల్ సంచలనంగా మారింది. ఈ న్యూడ్ వీడియో కాల్ మెుత్తం ఎంపీ గోరంట్ల మాధవ్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంపీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఏకంగా లోక్‌సభ వరకు ఆ వీడియో వ్యవహారం వెళ్లింది. గోరంట్ల మాధవ్ ఇమేజ్‌కు డ్యామేజ్ చేయడంతోపాటు వైసీపీకి కూడా డ్యామేజ్ తీసుకువచ్చింది. అనంతరం వివాదం సద్దుమణిగినప్పటికీ ఆ వీడియో వ్యవహరం మాత్రం ఇప్పటికీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు మాయని మచ్చగానే మిగిలింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ వీడియో ఎఫెక్ట్ లేక ఏంటో తెలియదు కానీ గోరంట్ల మాధవ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాల్లో కనిపించడం చాలా అరుదుగా మారింది. భారీ బహిరంగ సభలలో మాత్రమే తళుక్కుమంటున్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలో కనీసం ఆయన నామ మాత్రంగా కూడా పాల్గొనడం లేదు. దీంతో ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయాలకు దూరం అయినట్లేనా అన్న ప్రచారం జరుగుతుంది. హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆశావాహులు హిందూపురం కోసం ఇప్పటికే పైరవీలు మెుదలు పెట్టేశారు. ఈ విషయం తెలిసినప్పటికీ తమకెందుకులే అన్నట్లు గోరంట్ల మాధవ్ వ్యవహరిస్తున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.