- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడబిడ్డల ఆత్మగౌరవంతోపాటు దేశభద్రతకు ముప్పు: హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ఎంపీ రామ్మోహన్ నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ సాంకేతికతతో జరిగే దుష్పరిణామాలపై దృష్టి సారించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్‌ను కోరారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ఆహ్వానించాల్సి ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. అయితే అది సవ్యమైన రీతిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఉదంతాన్ని ప్రస్తావించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో మానవ ప్రమేయం లేకుండానే అసాంఘిక కార్యకలాపాలకు తెరదీయవచ్చని పేర్కొన్నారు. సినీ నటి ఘటనే దేశంలో సామాన్య యువతికి ఎదురైతే.. ఆమె భవిష్యత్, కుటుంబం పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. విపరీత సౌలభ్యం అనేది అటు మన ఇంటి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో పాటు దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎత్తి చూపారు. సాంకేతికత పెరుగుతున్న సాంకేతికత అనేది ఉత్పాదనలో అదనపు బలంగా ఉండాలి మినహా.. మానవ సంబంధాలకు ప్రమాదం కలిగించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, దేశంలో డీపీ ఫేక్ సాంకేతికత ఇష్టానురీతి వినియోగం, నియంత్రణపై నిపుణులైన వారితో పున: పరిశీలించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు. ఇకపోతే ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఏఐ ఆధారంగా తయారుచేసిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్ స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్‌కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ చర్యను సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ఖండిస్తున్నారు. తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ చర్యలను ఖండించారు. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.