- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: నడిరోడ్డుపై ఘోరం.. నలుగురు దుర్మరణం

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur Distict)లో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై నలుగురు దుర్మరణం(Four People Died) చెందారు. కూడేరు మండలం కమ్మూరు(Kammuru) దగ్గర ఆటో(Auto)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 నెలల చిన్నారి సహా ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని గుర్తించారు. ప్రమాదానికి గురైన ఆటోను, కారును క్రేన్ సాయంతో రోడ్డు పక్కకు తీశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి వద్దకు చేరుకున్న బంధువులు శోక సంద్రంలో మునిపోయారు. ఈ విషయంలో వారి స్వగ్రామంలో తెలియడంతో స్థానికులు సైతం కంటతడిపెట్టుకున్నారు. మృతులకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ ఘటనతో వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని, కచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పారు. డ్రైవర్లు డ్రంక్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అతివేగం అసలు వద్దని.. రోడ్డు ప్రమాదాలకు గురి కావొద్దని పోలీసులు సూచించారు.