- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: ఏం చేశారంటే.. జాకెట్ ఇచ్చాం.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
విజయనగరం, దిశ ప్రతినిధి: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చేసిన అభివృద్ధి ఏదని అడిగితే వేసుకున్న జాకెట్ ను చూపించి.. గతంలో మీకు జాకెట్ గుడ్డ కూడా లేదు అని అవహేళన చేయడం సబబు కాదని ప్రజలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
ఓ ప్రజాప్రతినిధి మహిళలతో ఇలా ఎలా మాట్లాడతారు అని ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో మంగళవారం బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఎన్నికల ప్రచారానికి బొబ్బిలి మండలంలోని డొంగురువలస తండాకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శంబంగిని ఓ గిరిజన మహిళ నిలదీశారు. ఎలా ఉండేవాళ్ళం అలానే ఉన్నాం.. మాకు ఏం చెయ్యలేదు మీరు మీ ప్రభుత్వం.. మమ్మల్ని వదిలెయ్యడని అని ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు తమని సమర్ధిచుకునేందుకు ప్రయత్నించారు. మీ పెళ్లి అయిన సమయంలో ఈ ఊరు ఎలా ఉంది అని మహిళను వైసీపీ కార్యకర్త అడిగారు.
అందుకు మహిళ ఇలానే ఉంది అని సమాధానం ఇచ్చింది. దానికి ఎమ్మెల్యే, అతని అనుచరులు అప్పుడు ఇల్లు ఉన్నాయా..? రోడ్డు ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆమె రోడ్డు వేశారు.. అది కూడా ఓ వైపు అప్పుడే పోతోందని.. కొండోళ్ళం కొండోల్లగానే ఉన్నాం అని ఆవేధన వ్యక్తం చేశారు.
అయితే ఆ మహిళ ఆవేధనను ఎమ్మెల్యే అర్ధం చేసుకోకపోగా ఆమె చిన్నబుచ్చుకునేలా మాట్లాడారు. కొండోల్లు కొండోళ్లుగా లేరని.. అప్పడు జాకెట్ గుడ్డ ముక్క కూడా లేదు మీకు.. చీర కప్పుకునేవాళ్లు. ఇప్పుడు జాకెట్ ఉందికదా అని మహిళను ఎద్దేవ చేశారు.